బీఆర్ఎస్లో కవిత, జగదీష్ రెడ్డి మధ్య గొడవ పీక్స్‌కు చేరింది. కవిత ‘లిల్లీపుట్ నాయకుడు’ అంటూ జగదీష్ రెడ్డిని విమర్శిస్తే.. ఆయన కూడా ఘాటుగా బదులిచ్చారు. ‘నా ఉద్యమ ప్రస్థానం గురించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లు’ అంటూ కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణల మాటలనే కవిత వల్లే వేస్తుందని ఎద్దేవా చేశారు. ఈ మాటల యుద్ధం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ భవిష్యత్తుపైనే ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పార్టీ అధిష్టానం ఈ అంతర్గత పోరును ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.