ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఏపీ ప్రభుత్వం ఐదుగురు పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం మార్చి 20న పోలింగ్ నిర్వహించనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు నామినేషన్లను కూడా దాఖలు చేశారు. అయితే దీనిలో తమ నాయకుడి పేరు లేదంటూ పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిని నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే దీనిలో ఎంత వరకు నిజం ఉంది..? తెలుసుకుందాం.