గత నెలలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. వారి కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగతుూ సినిమాను తలపించింది. దువ్వాడ ఇంటి వద్ద శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెల ఆందోళన చేపట్టడంతో విషయం బయటపడింది. ఆయన స్నేహితురాలు డ్యాన్స్ టీచర్ దివ్వెల మాధురి ఈ ఎపిసోడ్‌లో కీలకంగా ఉన్నారు. ఆమె పేరు బయటకు వచ్చిన తర్వాతపలాస జాతీయ రహదారిపై తన కారుతో మరో కారును ఢీకొట్టి మాధురి ఆత్మహత్యకు యత్నించారు.