జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి లభించింది. ఏపీ ప్రభుత్వం ఆయనను ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. త్వరలోనే నాగబాబు ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నాగబాబును ఆయన సోదరుడు చిరంజీవి అభినందించారు. పూలమాల వేసి సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.