Airtel: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక చాలా ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకుని తీవ్రంగా విలవిలలాడిపోతున్నాయి. ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు భారీ ఊరట కల్పించింది. ప్రీపెయిడ్‌తోపాటు, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు కూడా మినహాయింపు ప్రకటించింది. ప్రస్తుత విపత్తు సమయంలో తమ కస్టమర్లకు అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది.