తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల నిర్మూలన కోసం భారీ ఆపరేషన్ చేపట్టాయి. నాలుగు రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్‌లో ఇప్పటికే 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. హెలీకాప్టర్లు, డ్రోన్ల సహాయంతో భద్రతా దళాలు దాడులు చేస్తున్నారు. కర్రెగుట్టను మూడువైపులా ముట్టడి చేసి మావోయిస్టులకు పారిపోవడానికి మార్గం లేకుండా చేశారు. 10 వేల మంది భద్రతా సిబ్బంది ఆపరేషన్‌లో పాల్గొన్నారు.