ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అక్టోబర్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముంది. తెలంగాణలో 615.5 మిల్లీమీటర్ల వర్షపాతంతో 17 శాతం లోటు నమోదైంది.