తెలంగాణవాసులకు టామ్‌కామ్ జర్మనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీపీటీ లేదా ఎంపీటీ విద్యార్హత ఉన్న 43 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. జీతం నెలకు రూ.3.4 లక్షల వరకు ఇస్తారని వివరించింది. జర్మన్ భాషలో బీ1 స్థాయి నైపుణ్యం అవసరమని తెలిపింది.