కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దమ్ముంటే కేంద్ర బడ్జెట్ మీద బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ సవాలు విసిరారు. ఈ మేరకు.. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వీడియోలను బండి సంజయ్ విడుదల చేశారు.