ఎల్ఆర్ఎస్ అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం వేదికగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత నాలుగేళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎల్ఆర్ఎస్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పదిశాతం ప్లాట్లు రిజిస్ట్రరైన లేఅవుట్లలో మిగతా వాటికి ఎల్ఆర్ఎస్‌కు అవకాశం ఇస్తున్నారు. మార్చి 31 వరకూ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అప్పటి వరకూ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం ఇవ్వాలని నిర్ణయించింది.