Ys Sharmila Jagan Tirumala Declaration: తిరుమల లడ్డూ వివాదాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేయాలని వైఎస్ షర్మిల డిమాీండ్ చేశారు. ఈ మేరకు సీజేఐకు లేఖ కూడా రాశారు. తిరుమల డిక్లరేషన్ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అసలు పాలన జరుగుతోందా?.. సీఎం చంద్రబాబు శాంతి హోమాలు చేస్తుంటే.. పవన్ దీక్షలు చేస్తున్నారన్నారు. ఇటు వైఎస్ జగన్ ప్రక్షాళన పూజలంటూ రాజకీయాలు చేస్తున్న్డారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ అంశంపై సవాళ్లు, ప్రతిసవాళ్లు, ప్రమాణాలు, ప్రక్షాళనలు కాదు. నిజం కావాలి అన్నారు.