షాద్ నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడి చేసిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా ? అని మండిపడ్డారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదని.. మహిళలను గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ దౌర్జన్యాలు మాత్రం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.