ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏఎన్‌యూ 50 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకుల కోసం పూర్వ విద్యార్థులంతా ఒక్కటై ఘనంగా ఈ వేడుకలు చేస్తున్నారు. అయితే, ఈ వేడుకల కోసం ఏర్పాటు చేసిన 50 ఏళ్ల ప్రస్థాన లోగో అందర్నీ ఆకట్టుకుంది. గ్రానైట్ వ్యాపారి, వర్సిటీ పూర్వ విద్యార్థి రూ. 10 లక్షలతో ప్రత్యేక లోగో సిద్ధం చేస్తున్నారు. స్వర్ణోత్సవం ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూ. 12 లక్షలతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ రూపొందించనున్నారు.