ఏటీఎంలో డబ్బులు నింపే వ్యాన్ నడిపే డ్రైవర్.. ఆ డబ్బులను కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే అతడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. మొత్తం వ్యాన్ నుంచి రూ.56 లక్షలు కొట్టేసి పరారైన ఆ డ్రైవర్.. దేశంలోని పలు రాష్ట్రాలకు తిరిగాడు. గత 11 రోజులుగా లగ్జరీ జీవితం అనుభవించిన డ్రైవర్.. ఏకంగా రూ.22 లక్షలు ఖర్చు చేశాడు. 3 నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి గురైన ఆ డ్రైవర్ డబ్బులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.