సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చితో ఓ యువకుడు రైలు పట్టాలపై డేంజరస్ విన్యాసం చేశాడు. వేగంగా వస్తున్న రైలు కింద పడుకున్నాడు. ట్రైన్ వెళ్లిన తర్వాత.. లేచి సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చిపని అని మండిపడ్డారు. వ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దని హితవు పలికారు.