AP Free Bus Scheme In Ac Electric Buses: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. త్వరలో ఎలక్ట్రిక్ ఏసీ సిటీ, పల్లె వెలుగు బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. రాష్ట్రానికి 1050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, బస్టాండ్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కడప బస్టాండ్‌లో రూ.1.30 కోట్లతో సిమెంటు రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు.