రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబుల్ ధమాకా ప్రకటించింది. వెటరన్, ఫ్యామిలీ సీపీఎస్ కంట్రిబ్యూషన్ గురించి ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల గ్రాట్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 2017 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును రెండేళ్లు పెంచింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన సచివాలయ సీపీఎస్ అసోసియేషన్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేసింది.