ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా పీవీ మోహన్ నియమితులయ్యారు. సంస్థాగత నియామకాల్లో భాగంగా పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జులను నియమించింది. ఈ క్రమంలోనే ఏపీ బాధ్యతలను పీవీ మోహన్‌కు అప్పగించారు. గుజరాత్ బాధ్యతలను రణదీప్ సుర్జేవాలా, పంజాబ్ ఇంఛార్జిగా సచిన్ పైలెట్, అస్సాం ఇంఛార్జిగా భూపేశ్ బఘేల్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది.