IPL Fan Park in Kakinada: ఐపీఎల్ ఫైనల్ సందడి కాకినాడలో మొదలైంది. జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం కాకినాడ డీఎస్ఏ గ్రౌండ్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు కానుంది. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ చొరవతో ఉచితంగా ఈ వేడుకను ఆస్వాదించవచ్చు. లక్కీ డ్రా ద్వారా బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. స్టేడియం వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేశారు. క్రికెట్ అభిమానులకు ఇది ఒక పండగలాంటి వార్త.