Andhra Pradesh Village Ward Secretariat Employees Transfers Rule: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేస్తూ, సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదని ఆదేశించింది. జులై 30లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించింది. అంధులు, వికలాంగుల పిల్లల తల్లిదండ్రులకు, ఇతర తీవ్ర అనారోగ్యాలున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే దగ్గర ప్రాంతాలకు బదిలీ చేస్తారు.