మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన కాన్‌స్టిట్యూషన్ క్లబ్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. 1947లో ఏర్పాటైన ఈ క్లబ్, ఎంపీలు, మాజీ ఎంపీల సమావేశాలకు వేదిక. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షుడిగా ఉన్న ఈ సంస్థకు జితేందర్‌రెడ్డి ఎన్నిక కావడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ముఖ్య మైలురాయి. ఇది ఆయనకు దక్కిన గొప్ప గౌరవం.