AP Govt Kaushalam: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త్ చెప్పింది. రానున్న నాలుగు నెలల్లో వారికి ఉద్యోగం కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. కౌశలం పోర్టల్ ద్వారా ఈ పని చేయనుంది. ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రైవేట్ కంపెనీలు తమకు కావాల్సిన నైపుణ్యాలున్న వారిని ఈ పోర్టల్ నుండే ఎంపిక చేసుకోవచ్చు. సంక్రాంతి తర్వాత భారీ ఐటీ జాబ్ ఫెయిర్ కూడా నిర్వహించనున్నారు.