ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 15 నుంచి 'ఇంటింటికీ మనమిత్ర' కార్యక్రమం ప్రారంభం కానుంది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పిస్తారు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో మన మిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009ను సేవ్ చేస్తారు. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా 254 సేవలు అందుబాటులో ఉండగా, జూన్ నాటికి 500కు పెంచనుంది ఏపీ ప్రభుత్వం.