Andhra Pradesh Talliki Vandanam Cheating: ప్రకాశం జిల్లా పొదిలలో కొత్త తరహా మోసం బయటపడింది. తల్లికి వందనం పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.. తల్లికి వందనం డబ్బులు అకౌంట్‌లో వేస్తానని నమ్మించి నిండా ముంచేశాడు. రివర్స్‌లో ఓ అమాయకుడి అకౌంట్ నుంచి డబ్బులు మాయం చేశాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పథకాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.