AP ward village secretariat services closed: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక! రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. జూన్ 7 నుంచి 10 వరకు, ఏపీ సేవ పోర్టల్‌ను డేటా సెంటర్‌కు తరలించే ప్రక్రియ కారణంగా ఈ అంతరాయం ఏర్పడింది. రేషన్ కార్డులు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వంటి పది రకాల సేవలు నిలిపివేయబడ్డాయి. జూన్ 11 నుంచి సేవలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.