AP Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మూడు రోజుల పాటూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే మిగిలిన జిల్లాల్లో మాత్రం ఎండలు, వేడిగాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ వెదర్ రిపోర్ట్ వివరాలు ఇలా ఉన్నాయి.