ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఈ ఏడాది 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సచివాలయంలో ఎస్ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. సౌర విద్యుత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు పీఎం సూర్యఘర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.