ఏపీ ప్రజలకు భారీ ఉపశమనం కలిగించే వార్త వినిపించారు సీఎం చంద్రబాబు. విద్యుత్ ఛార్జీలు పెంచుతారంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న వార్తలకు సీఎం చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచేది లేదని చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో.. ఏపీ ప్రజలకు భారీ ఉపశమనం కలగనుంది. మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు చర్చకు రాగా.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.