Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వానలు డుతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాాలను వర్షం ముంచెత్తింది. తూర్పుగోదావరి, ఏలూరు, విజయవాడ, పాడేరు విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. మరో రెండు, మూడు రోజులు వానలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ వానలు, వరదలకు ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తుతోంది.. దీంతో గేట్లు ఎత్తి నీళ్లకు కిందకు విడుదల చేస్తున్నారు.