AP Weather Today: వాతావరణ శాఖ ఏపీకి వర్ష సూచన చేసింది. ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు, బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా. అయితే, నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇది రైతులకు కొంత ఊరటనిచ్చే అంశం.