AP Whatsapp Governance: పౌర సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గవర్నెన్స్ మీద ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ సమీక్ష నిర్వహించారు. మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా ఇప్పటికే 161 పౌర సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై అన్ని సర్టిఫికేట్లు వాట్సప్ ద్వారా అందించనున్నట్లు ఏపీ ఐటీశాఖ సెక్రటరీ తెలిపారు. అన్ని ధ్రువపత్రాలు వాట్సాప్‌లోనే డౌన్ లోడ్ చేసుకునే వెసలుబాటు తెస్తామని.. ఏపీ పౌరులకు అందరికీ డిజిలాకర్ సౌకర్యం కల్పిస్తామని భాస్కర్ వెల్లడించారు.