AP Govt Employees EHS Bills Online System New Software: ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకుసంబంధించి ఆన్‌లైన్ విధానం అమలు చేయనుంది. దీని కోసం కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్త సాఫ్ట్‌వేర్ రూపొందించే బాధ్యతను ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌కు అప్పగించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.