Andhra Pradesh Government Employees Avail Treatment In Telangana Hospitals: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) కింద వైద్య సేవలను తెలంగాణలో విస్తృతం చేసింది. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆ రాష్ట్రంలో గుర్తింపునిచ్చిన అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు..వారి కుటుంబాలకు చికిత్స పొందే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు.