Andhra Pradesh Consultative Forum Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేసింది. ఈ ఫోరం ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేష్ వ్యవహరించనున్నారు. రెండేళ్ల కాలపరిమితితో ఫోరం పనిచేయనుంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఈ ఫోరం పనిచేయనుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ జీవోను విడుదల చేసింది.