ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసుల్లో ఉంటూ మరణించిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల అంత్యక్రియల కోసం రూ.15000 ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉండగా.. దీనిని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సర్వీసులో ఉన్న సమయంలో మరణిస్తే.. వారి చట్టబద్ధమైన వారసులకు అంత్యక్రియల కోసం రూ.15000 అందజేస్తారు. ఈ మేరకు ఏపీ స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.