Eluru Man Wedding Reception Dishes: ఏలూరు జిల్లాకు చెందిన బీజేపీ నేత కోడూరి లక్ష్మీనారాయణ తన కుమారుడి రిసెప్షన్‌కు వచ్చే అతిథుల కోసం వినూత్న ఆహ్వాన పత్రికను రూపొందించారు. వడ్డించే పదార్థాల వివరాలు ముందుగా తెలియజేయడం ద్వారా ఆహార వృథాను తగ్గించాలనే సదుద్దేశంతో ఆయన ఈ ప్రయత్నం చేశారు. భోజనంలో వడ్డించే పదార్థాల జాబితాను ముద్రించి, ఆహారాన్ని వృథా చేయకుండా సహకరించాలని కోరారు. ఈ ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.