Dharmavaram TDP Followers Protest: సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత ఏర్పడింది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా మల్లికార్జున నియామకంపై వివాదం చెలరేగింది. గతంలో మల్లికార్జున టీడీపీ కార్యకర్తలను వేధించారని.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశారని ఆరోపిస్తున్నారు. అలాంటి ఆరోపణలున్న వ్యక్తిని మళ్లీ కమిషనర్‌గా ఎలా నియమిస్తారని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించారు.. అందరూ కలిసి మంత్రిని అడ్డుకున్నారు. అయితే ధర్మవరంలో కూటమి నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని నేతలు తెలిపారు. కమిషనర్ నియామకంపై వివాదం ఉందని.. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.