ఏపీ మంత్రి నారా లోకేష్‌తో భేటీ వెనుక.. అసలు విషయం చెప్పేసిన కేటీఆర్..

1 year ago 38
​​​తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. తనపై వచ్చిన ఆరోపణలకు ధీటుగా బదులిచ్చారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలకు కనీసం గుండు సూదంత ఆధారం చూపలేదని ఎద్దేవా చేశారు. కొద్దిరోజులుగా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే ప్రస్తావిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్‌తో తన రహస్య భేటీ ఆరోపణలపై కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. 'నేను ఏపీ మంత్రి లోకేష్‌ను కలవలేదు.. ఒకవేళ కలిసినా తప్పేంటి?' అని ప్రశ్నించారు. లోకేష్ తనకు మంచి మిత్రుడని, సోదరుడి లాంటివాడని.. ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అర్థరాత్రి కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
Read Entire Article