ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తామని చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వానికి సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా ప్రధానమని చెప్పుకొచ్చారు. మరోవైపు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది.