Andhra Pradesh Government Partner with Microsoft: రాష్ట్రంలోని యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. యువతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు పెంచేందుకు ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై 2 లక్షల మంది యువతకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వీరికి ఏడాది వ్యవధిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్, ఏపీఎస్‌ఎస్‌డీ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి.