మాజీ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. రిటైర్మెంట్ సమయంలోనే ప్రజాసేవలో కొనసాగుతానని మాటిచ్చానన్న ఆయన.. మాట ప్రకారం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏ పార్టీలో అనే దానిపై క్లారిటీ లేదు. అయితే గతంలోనూ పలువురు ఐఏఎస్ అధికారులు వీఆర్ఎస్ తీసుకుని, పదవీ విరమణ తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.