రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేసింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం.. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు రైతుల నుంచి ఈ- క్రాప్, ఈ - కేవైసీ ద్వారా వివరాలను సేకరించాలని.. ఆధార్ అనుసంధానం ద్వారా.. ఈ- కేవైసీ, ఈ - క్రాప్‌తో రైతుల ఖాతాల్లోకి నగదు చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లపై మార్గదర్శకాలు జారీ చేసింది.