Vijayawada Division Trains: రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. నాగపూర్ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్ పనుల దృష్ట్యా పలు రైళ్లను విజయవాడ, బలార్ష, నాగ్‌పూర్ మీదగా దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం-హజ్రత్ నిజాముద్ధీన్, ఎర్నాకుళం-బిలాస్‌పూర్, ఎల్‌టీటీ ముంబై-విశాఖపట్నం రైళ్లు దారి మళ్లించారు. సికింద్రాబాద్-రాయ్‌పూర్, నాందెడ్-సంత్రాగచి రైళ్లను రద్దు చేశారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తగిన విధంగా జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.