ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య... ఇటీవల వెలువడిన లాసెట్ ఫలితాల్లో 95 మార్కులతో 739వ ర్యాంకు సాధించారు. తన తండ్రి తంగిరాల ప్రభాకరరావు న్యాయవాది ఆశయాల బాటలో లా చదవాలని నిర్ణయించుకున్నారు. బీటెక్ పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన ఆమె.. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఉపఎన్నికల్లో గెలిచి.. నందిగామకు తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. 2024లో రెండోసారి గెలిచారు. మంత్రి లోకేష్ విడుదల చేసిన లాసెట్ ఫలితాల్లో 98 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. అందులో అమ్మాయిలదే పైచేయి నమోదైంది.