ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయం అంటూ వార్తలు కూడా వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మిథున్ రెడ్డి.. స్వల్ప ఊరట పొందారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దు అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.