Chandrababu On Daily Provisions Distribution: ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు సాయంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే చనిపోయినవారి కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం చెల్లిస్తామన్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో బురదను తొలగించే ప్రక్రియను చేపట్టబోతున్నారు. అలాగే హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని.. బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.