పాఠశాల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 12 నుంచి మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్.. జూన్ 12 నుంచి మధ్యాహ్నభోజనంలో సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు.