AP Registration At Secretariats Cancelled: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ,వార్డు సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ ఏడాది ఆగస్టులోనే పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ఆ ఉత్తర్వుల్ని వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ప్రక్రియ సజావుగా సాగలేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంది.