Andhra Pradesh Govt QR Code In Rtc Bus Stands: ఏపీఎస్‌ఆర్టీసీ దేవాదాయశాఖ బాటలో నడుస్తోంది. ఆర్టీసీ కూడా క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ముందుగా కాకినాడ బస్టాండ్‌లో అమలు చేస్తున్నారు.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని అదికారులు చెబుతున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు క్యూఆర్ కోడ్ విధాానాన్ని తీసుకొచ్చింది. ప్రయాణికులు ఆ కోడ్‌ను స్కాన్ చేసి వారి అభిప్రాయాలను తెలియజేయొచ్చు.