Andhra Pradesh Rains And High Temperatures: ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వర్షాలు, ఎండల దెబ్బకు ఉక్కపోత పెరిగిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే శుక్రవారం రోజు ఈ సీజన్‌లోనే అత్యధికంగా కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.